రంగులేయడం తప్ప రూలింగ్ తెలియదు.. ప్రజలకు వైసీపీ రిటర్న్ గిఫ్ట్ అదే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ పాలించడానికి పనికిరాదని అన్నారు.

ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు ఇసుక కొరతను వారికి రిటర్న్‌గిఫ్ట్‌గా ఇచ్చారంటూ మండి పడ్డారు కన్నా లక్ష్మీ నారాయణ. భవన నిర్మాణ కార్మికులకు రూ.150 కూలీ కూడా రావట్లేదని ఇలా అయితే వాళ్లు బతికేది ఎలా? అంటూ నిలదీశారు.

ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు కన్నా లక్ష్మీ నారాయణ.