ఏపీ కేబినెట్ నిర్ణయాలు : రివర్స్ టెండరింగ్, జీతాల పెంపునకు ఆమోదం

సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ

  • Publish Date - September 4, 2019 / 06:43 AM IST

సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ

సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రూ.3216.11 కోట్ల టెండర్ రద్దు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్ పద్దతిలో తాజా టెండర్లకు ఆమోదం. కాంట్రాక్టర్ కు ఇచ్చిన అడ్వాన్స్ ల రికవరీకి, మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు నిర్ణయాలకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఆశావర్కర్ ల జీతాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిసింది.

సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్టీసీ విలీనం, కమిటీ నివేదికపై చర్చించనున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైనా చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 25కు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేయనుంది. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు, నిధుల సమీకరణపై మంత్రివర్గం చర్చించనుంది.