ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏం ఉంది? ఎడారి రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరూ గర్వపడేలా ఉండాలనీ..కానీ అమరావతిని చూస్తే మాత్రం కచ్చితంగా ఎడారి గుర్తుకు వస్తుందని వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారనీ..అమరాతి భూముల్లో ఎంతో అవినీతి జరిగిందని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్నారు. అమరావతి విషయంలో అవినీతికి పాల్పడినవారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.