ఏపీ సీఎస్ మోడీ ఏజెంట్ – గోరంట్ల బుచ్చయ్య

  • Publish Date - April 21, 2019 / 10:24 AM IST

ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా 33 రోజులుంది. రోజులు దగ్గర పడుతున్నా కొద్ది నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ సీఎం బాబు చేపట్టిన సమీక్షలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోడీ  ఏజెంట్‌లా మారారు..ఎన్నికలయ్యాక 43 రోజులు రాష్ట్రంలో పరిపాలన ఆగిపోవాలా…? అంటూ TDP ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నిస్తున్నారు.

బాబు ప్రభుత్వం ఆపద్ధర్మం కాదు, జూన్ వరకూ పని చేసే హక్కు ఉందన్నారు. IT దాడులు  చేసి ఏం సాధించారు ? హైదరాబాద్‌లో ఆస్తులున్న IASలు కేసీఆర్‌కు ఊడిగం  చేసుకోండి విజయసాయిరెడ్డి ఎన్నికల కమిషన్ సభ్యుడిలా వ్యవహరించారన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యాయవ్యవస్థను భ్రష్ఠుపట్టిస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని గోరంట్ల జోస్యం చెప్పారు. 

ఎన్నికల అనంతరం ఏపీ సీఎం బాబు పలు శాఖలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనిని ప్రతిపక్షం ఆక్షేపించింది. వివరణ ఇవ్వాలని ఈసీ ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఆయా శాఖల మీటింగ్‌లో పాల్గొన్న వారు సమాధానం చెప్పాలని సీఎస్ సూచించారు. ఏం సమీక్షలు జరిపితే ఏం అయ్యింది..మీరు జరపడం లేదా ? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మే 23న ఫలితాలు రిలీజ్ కానున్నాయి.