కాల్ చేయండి..పట్టించండి : మాదక ద్రవ్యాల ఫిర్యాదుల నంబర్ ఇదే

  • Publish Date - November 28, 2019 / 09:51 AM IST

గంజాయి, గుట్కా, నల్లమందు, హెరాయిన్‌, చరస్‌, మార్పిన్‌, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపులు ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాట్స్ ఏప్ నంబర్ ని ప్రకటించారు. గంజాయితో పాటు ఎటువంటి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా ఎవరి దృష్టికి వచ్చిన సీఐడీ డిపార్ట్ మెంట్ కు సంబంధించి వాట్సప్ నెంబర్ 73822 96118  నండర్ ను డీజీపి గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. గంజాయి, మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు,  నిల్వలు వంటివాటి సమాచారం ఈ నంబర్ కు తెలియజేయాలని సూచించారు.
వాట్సప్ ద్వారా నోర్కోటిక్ సెల్, సీఐడీకి తెలియజేయవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి ఎవరు సమాచారం అందించినా వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని డీజీపీ తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టామనీ..పక్కా సమాచారం ఇచ్చి  పట్టిస్తే రివార్డులు కూడా అందిస్తామని  డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలియజేశారు.