తాడేపల్లిలో ఓటు వేసిన ఈసీ అధికారి ద్వివేది

  • Publish Date - April 11, 2019 / 02:47 AM IST

అమరావతి:  ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తాడేపల్లిలోని క్రిస్టియన్‌పేట మున్సిపల్ హై స్కూల్‌ లో ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ద్వివేది ఓటు వేసే సమయంలో వీవీప్యాట్ మొరాయించినట్లుగా తెలుస్తోంది. టెక్నికల్ టీం మొరాయించిన ఈవీఎంలను రిపేర్ చేస్తున్నామనీ ఓటర్లకు ఎటువంటి అసౌర్యం కలగకుంటా ఓటు వేసేందుక అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని ద్వివేది వివరించారు.