ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • Publish Date - December 18, 2019 / 05:36 AM IST

అన్ని రకాల ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీఫ్ ఇంజినీర్ బోర్డు సిఫార్సుల మేరకు మొతలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వలని నిర్ణయించింది. టెండర్ మొత్తంలో 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వనుంది.

ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు కూడా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వనున్నారు.  వరల్డ్ బ్యాంక్ నిధులతో చేపట్టే ప్రాజెక్టులు సహా ఈఏపీ ప్రాజెక్టులకు బిడ్ నిబంధనల ప్రకారం మొబలైజేషన్ అడ్వాన్సులపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.