విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల : 7 జీవోల ద్వారా పనులకు పాలనా అనుమతులు

ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. 7 జీవోల ద్వారా రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు లభించాయి.

  • Publish Date - December 26, 2019 / 10:27 AM IST

ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. 7 జీవోల ద్వారా రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు లభించాయి.

ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. 7 జీవోల ద్వారా రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు లభించాయి. కాపులుప్పాడ సమీపంలోని బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ.22.50 కోట్లు, కైలాసగిరి ప్లానిటోరియం కోసం రూ.37కోట్లు, సిరిపురం జంక్షన్ లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్, వాణిజ్య సముదాయం కోసం రూ.80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ సంస్థ కోసం రూ.88 కోట్లు, నాతయ్యపాలెం జంక్షన్ సమీపంలోని చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం కోసం రూ.90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్ లో భూగర్భ పార్కింగ్ కోసం రూ.40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్ నిర్మాణం కోసం రూ.75 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నిధులను విడుదల చేస్తూ గురువారం (డిసెంబర్ 26, 2019) సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్.. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేశారు. రాజధానిని తరలించడంలో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశారని చెప్పవచ్చు. సీఎం జగన్ పర్యటన కూడా విశాఖలో ఉండటంలో దానికి సంబంధించి ముందుగానే అభివృద్ధి పనులకు పాలనా పరమైన అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం తన పనిని చకా చకా చేసుకుంటూపోతోంది. ఇప్పటికే ఎక్కడ సీఎం రెసిడెన్సీ ఉండాలి, ఎక్కడ సెక్రటేరియల్ ఉండాలి అని పరీశిలించారు. దానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారయంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే విశాఖలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని చెప్పవచ్చు.

ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు స్వాగతిస్తే, కొందరు వ్యతిరేకించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు త్రీ కేపిటల్ ఫార్ములాని తీవ్రంగా వ్యతిరేకించారు. రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు అని నినదించారు. ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొననసాగించాలని డిమాండ్ చేశారు. కాగా, మూడు రాజధానులతో మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుందని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణకు, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని సూచించింది. పరిపాలన సౌలభ్యం కోసం, సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని కోరింది. రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ.. శుక్రవారం(డిసెంబర్ 20, 2019) తుది నివేదికను సీఎం జగన్ కి ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎంని కలిసి నివేదికను అందజేశారు. రిపోర్టులోని ముఖ్యమైన అంశాలను సీఎం జగన్‌కు వివరించారు.

రాజధానిపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా పట్టణాభివృద్ది రంగంలో నిపుణులతో కూడిన కమిటీ వేసింది. కమిటీ సభ్యులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించింది. ప్రజలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ చెప్పినట్టే.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తాము నివేదికలో సూచించామని జీఎన్ రావు కమిటీ సభ్యులు తెలిపారు. విశాఖలో హైకోర్టు బెంచ్, సీఎంవో, సెక్రటేరియట్, వేసవిలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సిఫారసు చేసింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ కొనసాగించి, నదికి దూరంగా ఉన్న మంగళగిరి ప్రాంతంలో పాలన భవనాలు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అమరావతి ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. మంత్రుల క్వార్టర్స్, రాజ్ భవన్, సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంటాయి.