ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటిని నియమించింది. 16 మంది సభ్యులతో కమిటీ నియమించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటిని నియమించింది. 16 మంది సభ్యులతో కమిటీ నియమించింది. 10 మంది మంత్రులు, నలుగురు అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. జీఎస్ రావు కమిటి నివేదికతో పాటు ఇతర నివేదికలను కూడా ఈ హైపవర్ కమిటి అధ్యయనం చేయనుంది. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి నేతృత్వం
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి నేతృత్వం వహించే ఈ కమిటీలో మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్నినాని, సుచరిత, ఆదిమూలపు సురేష్ సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, CCLA చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, లా సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరం అనుకుంటే ఈ హైపవర్ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
జీఎన్ రావు కమిటీ నివేదికతోపాటు ఇతర నివేదికల అధ్యయనం
జీఎన్ రావు కమిటీ నివేదికతోపాటు ఇతర నివేదికలను అధ్యయనం చేయనుంది. రాజధానికి సంబంధించి జీఎన్ రావు కమిటీతోపాటు బోస్టన్ గ్రూప్ సంస్థ ఇచ్చిన నివేదికపై కమిటీ వేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైపవర్ కమిటిని ఏర్పాటు చేస్తూ సీఆర్డీఏ జావోను కూడ విడుల చేశారు. డీజీపీకి కూడా హైవర్ కమిటీలో స్థానం కల్పించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్ గా వ్యక్తిని కూడా కమిటిలో మెంబర్ గా పెట్టారు. లా కమిషనర్ కూడా కమిటీలో మెంబర్ గా పేర్కొన్నారు. ఇప్పటికే జీన్ రావు కమిటీ నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. జనవరి 3న బోస్టన్ గ్రూప్ కంపెనీ నివేదికను అందజేయలని ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి..కమిటీ ఇచ్చిన నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించి, నివేదికను సమర్పించనుంది.
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20 తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూడు రాజధానుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
రెండు నివేదికల ఆధారంగానే నిర్ణయం
జనవరి 18 నుంచి 20 వ తేదీ మధ్యలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మూడు రాజధానులపై తుది నిర్ణయం తీసుకోనుంది. హైపవర్ కమిటీలో మంత్రులు, అధికారులు ఉండనున్నారు. జనవరి 14లోపు నివేదిక సమర్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. జనవరి 3న బోస్టన్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అంశం చర్చకు వచ్చిందని మంత్రి కన్నబాబు తెలిపారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. బోస్టన్ గ్రూప్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. రెండు నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.