తిరుమలలో 100 మంది రిటైర్డ్‌ ఉద్యోగుల తొలగింపు

టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్‌ ఉద్యోగులను జగన్‌ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.

  • Publish Date - November 1, 2019 / 11:51 AM IST

టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్‌ ఉద్యోగులను జగన్‌ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.

టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్‌ ఉద్యోగులను జగన్‌ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2323ని విడుదల చేసింది. పదవీ విరమణ చేసినప్పటికీ.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది రూపంలో టీటీడీలో తిష్టవేసిన దాదాపు వందమంది ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో… శ్రీవారి ఆలయ ఓఎస్డీగా ఉన్న డాలర్ శేషాద్రిపైనా వేటు తప్పదని భావించారు. అయితే.. ఆయన ఇవాళ కూడా విధులకు హాజరవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

సిబ్బంది తొలగింపు ప్రక్రియను ప్రారంభించిన టీటీడీ… ఇప్పటికే వందమందికి ఉద్వాసన చెప్పింది. ఇందులో.. శ్రీనివాస భక్తి వాగ్మయ ప్రాజెక్ట్ అధికారి, ప్రముఖ సహస్రావధాని మేడసాని మోహన్, ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి సముద్రాల లక్ష్మణయ్య, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సమన్వయకర్త చెంచురామయ్య లాంటి ప్రముఖులున్నాయి. అయితే ఆ లిస్టులో టీటీడీలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన డాలర్ శేషాద్రి పేరు మాత్రం లేదని తెలుస్తోంది. ఏపీ సర్కార్ జీవోనుంచి ఆయనకు మినహాయింపునిచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టక్కున గుర్తొచ్చే పేరు డాలర్ శేషాద్రి. టీటీడీలో డాలర్ శేషాద్రికి అంత పేరు ఉంది. అయితే ఆయనపై ఎన్ని ప్రశంసలున్నాయో అంతే రేంజ్ లో విమర్శలు కూడా ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న డాలర్ శేషాద్రి పదవీ విరమణ పొంది పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ… ఇంకా శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 

మరోవైపు… డాలర్ శేషాద్రి తొలగింపునకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు ఆయనకు వర్తించే అవకాశం లేదని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో వాటిని పక్కన పెట్టారని సమాచారం. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న డాలర్ శేషాద్రిని తొలగిస్తే ఆ ప్లేస్ లో ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమించాలనే దానిపైనా క్లారిటీ లేకపోవడంతో డాలర్ శేషాద్రిని కొనసాగింపు తథ్యమని తెలుస్తోంది. 

గతంలో రెండుసార్లు కోర్టు తీర్పుతో శ్రీవారి సేవ నుంచి విరామం పొందిన ఆయన.. తిరిగి తన పలుకుబడితో విధుల్లో కొనసాగుతున్నారు. అయితే.. జీవో 2323 ప్రకారం ఆయన కూడా తప్పుకోవాల్సి ఉన్నా.. ఇప్పుడు కూడా తన పలుకుబడి ఉపయోగించిన సేఫ్‌ అయినట్లు టీటీడీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మొత్తంగా తనపై వేటు పడకుండా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి.