మద్యం వల్లే అత్యాచారాలు

మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.

  • Publish Date - December 8, 2019 / 02:41 PM IST

మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.

మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. అందుకే ఏపీలో మద్యం నియంత్రణకు సీఎం జగన్ నడుం బిగించారు అని చెప్పారు. లిక్కర్ ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడటం లేదన్నారు. మహిళలకు భరోసా కల్పించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 43వేల బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీ ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. మద్యం దుష్ప్రభావంపై కాలేజీల్లో అవగాహన కల్పిస్తామని మంత్రి నారాయణస్వామి తెలిపారు.

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తొలుత బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత మద్యం షాపులు తగ్గించారు. మద్యం విక్రయాల సమయాన్ని కుదించారు. లిక్కర్ ధరలు కూడా పెంచారు. మరిన్ని కఠిన నిర్ణయాలను అమలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు సీఎం జగన్.