ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల అయ్యాయి. క్యాంపు కార్యాలయలో గురువారం(సెప్టెంబర్ 12,2019) సీఎం జగన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. 2వేల 623 పోస్టుల భర్తీకి పరీక్షలు
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల అయ్యాయి. క్యాంపు కార్యాలయలో గురువారం(సెప్టెంబర్ 12,2019) సీఎం జగన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. 2వేల 623 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ హాజరయ్యారు. సివిల్, ఆర్మ్ డ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో 2723 పోస్టులకు గాను 2623 పోస్టులను పోలీసు శాఖ భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను slprb.ap.gov.in వెబ్‌సైట్లో పోలీస్ శాఖ అందుబాటులో ఉంచింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.comకు సెప్టెంబర్ 16వ తేదీలోపు పంపొచ్చని పోలీసుశాఖ తెలిపింది.
రాత పరీక్షకు 64వేల 575 మంది హాజరు కాగా 58వేల 007 మంది అర్హత సాధించారు. వీరిలో 53వేల 509 మంది పురుషులు, 4వేల 498 మంది మహిళలు ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2018 నవంబర్ లో నోటిఫికేషన్ జారీ చేశారు. 3.94 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టుల అనంతరం అర్హత సాధించిన వారు తుది రాత పరీక్షకు ఎంపికయ్యారు.