ఏపీ ఓటర్ల లిస్ట్   : సీఎంను డిసైడ్ చేసేది మహిళలే

  • Publish Date - January 12, 2019 / 11:32 AM IST

అమరావతి : ఏపీలో సీఎంను డిసైడ్ చేసేది మహిళలే కావటం విశేషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పురుష ఓట్లర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువమంది వున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల లిస్టే చెబుతోంది.ఏపీలోని ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 12న  ప్రకటించింది. రాష్టంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 అని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఇందులో 1,83,24,588 మంది పురుష ఓటర్లు కాగా… 1,86,04,742 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్లు 3,761 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా… విజయనగరం జిల్లాలోఅతి తక్కువ  ఓటర్లు ఉన్నారు.

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య..
శ్రీకాకుళం – 20,64,330
విజయనగరం – 17,33,667
విశాఖపట్నం – 32,80,028
తూర్పుగోదావరి – 40,13,770
పశ్చిమగోదావరి – 30,57,922
కృష్ణా – 33,03,592
గుంటూరు – 37,46,072
ప్రకాశం – 24,95,383
నెల్లూరు – 22,06,652
కడప – 20,56,660
కర్నూలు – 28,90,884
అనంతపురం – 30,58,909
చిత్తూరు 30,25,222

ఈ లిస్ట్ ప్రకారంగా చూస్తే మహిళా ఓటర్లే రాష్ట్ర సీఎంను డిసైడ్ చేసేది మహిళే అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఏపీ మహిళలు ఏపార్టీకి..ఏ నాయకుడికి పట్టం కట్టనున్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తేలనుంది.