ఫోర్ బోనస్ : 24 వేళ్లతో పుట్టిన బాబు

ప్రపంచంలో ఎన్నో వింతలు..విశేషాలు..ఈ వింతలకు కొదవ లేదు. మనిషి పుట్టుకలో కూడా ఈ వింతలు చోటుచేసుకుంటుంటాయి అప్పుడప్పుడు.

  • Publish Date - March 1, 2019 / 11:09 AM IST

ప్రపంచంలో ఎన్నో వింతలు..విశేషాలు..ఈ వింతలకు కొదవ లేదు. మనిషి పుట్టుకలో కూడా ఈ వింతలు చోటుచేసుకుంటుంటాయి అప్పుడప్పుడు.

ఆలూరు : ప్రపంచంలో ఎన్నో వింతలు..విశేషాలు..ఈ వింతలకు కొదవ లేదు. మనిషి పుట్టుకలో కూడా ఈ వింతలు చోటుచేసుకుంటుంటాయి అప్పుడప్పుడు. సాధారణంగా మనిషి మనిషికి చేతులకు..కాళ్లకు కలిపి ఎన్ని వేళ్లుంటాయి అంటే 20 అని ఠక్కున చెప్పేస్తాం. కాని కొంతమంది ఒక్కో చేతికి ఆరు వేళ్లు ఉండటం చూస్తుంటాం.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

కానీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జన్మించిన ఈ శిశువు 24 వేళ్లతో పుట్టింది. ఆ శిశువు కాళ్లు, చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు ఉన్నాయి. గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన సరోజ దంపతులకు పుట్టిన ఈ  మగబిడ్డ 24 వేళ్లతో జన్మించగా.. రెండు చేతులకు.. రెండు కాళ్లకు ఆరేసి వేళ్లు ఉండటం విశేషం.
Read Also : ఫోర్ బోనస్ : 24 వేళ్లతో పుట్టిన బాబు

ఆరు వేళ్లతో పుట్టే పిల్లలకు ఒక వేలు అతుక్కొని ఉంటుంది. కానీ ఈ శిశువుకు మాత్రం ఆరు వేళ్లు విడివిడిగానే ఉన్నాయి. ఈ శిశువును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
Read Also : అభినందన్ కోసం ఎదురుచూస్తోన్న సినీ తారలు