ఓ మహిళకు ఉన్న రోషం మీకు లేదా 

  • Publish Date - February 1, 2019 / 05:58 AM IST

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై అసెంబ్లీలో చర్చ వాడీ వేడిగా జరుగుతున్న క్రమంలో చంద్రబాబు కేంద్రాన్ని విమర్శిస్తు చేస్తున్న ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యే  విష్ణుకుమార్ రాజు అబ్జెక్షన్ అంటు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయనపై మండి పడ్డారు. ఏపీ అభివృద్ధి కోసం ఉన్నీసా బేగం అనే ఓ రిటైర్డ్ మహిళా డీఈవో తన పెన్షన్ డబ్బుల నుండి రూ.50 వేలు..అంగన్వాడీలో పనిచేసే ఆమె కుమార్తె జీతంతో కలిపి మొత్తం రూ.65 వేల 5 వందలను ఒక మహిళ అమరావతికి  విరాళంగా ఇస్తూ..రాష్ట్రాభివృద్ధికి మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఈ చిన్న మొత్తాన్ని ఇస్తున్నానని ఉన్నీసా బేగం తెలిపారనీ..కానీ కొంతమంది నేతలకు  కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించేదుకు భయపడుతున్నారనీ..వారికి పౌరుషం  లేదా అంటు ప్రశ్నించిందనీ..ఒక సాధారణ మహిళ ప్రశ్నిస్తుంటే..బీజేపీ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారనీ..ఇది ఎంత వరకూ సమంజసం అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజును చంద్రబాబు ప్రశ్నించారు.  ఓ మహిళకు ఉన్న పౌరుషం కూడా ఏపీ బీజేపీ నేతలకు లేదా అంటు మండిపడ్డారు. 

అభివృద్ధిలో ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ ఎలా వుందీ..ఏపీ ఎలా ఉందో గమనించి బీజేపీ నేతలు మాట్లాడాలనీ..కష్టాల్లో ఉన్న ఏపీని సపోర్ట్ చేయాల్సింది పోయి..సిగ్గులేకుండా కేంద్రాన్ని పొడుగుతున్నారనీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏం తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఏంటీ..ఏపీకి న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టనంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.