అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. గల్లంతైన ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడటంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇద్దరు గల్లంతైయినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
మహారాష్ట్రలోని హాహిరి నుంచి గూడెంకు నాటుపడవలో ఆరుగురు అధికారులు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఆఫీసర్లు గల్లంతు అవ్వగా మరో నలుగురు అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.