బోట్ల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం : రెండు బోట్లు దగ్థం 

  • Publish Date - May 1, 2019 / 06:03 AM IST

తూర్పుగోదావరి యు.కొత్తపల్లి  మండలం మూలపేట శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలోని బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. రూ.55 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 

రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలో బోట్ల తయారీ కేంద్రంలో బుధవారం (మే 1) తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధం కాగా వీటితో పాటు కొంత సామాగ్రి కూడా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.  కాగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.