చిత్తూరు జిల్లాలో ప్రియురాలు కోసం ప్రియుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చిత్తూరుకు చెందిన వినోద్ ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వినోద్ ఇంటి నుంచి అమ్మాయిని అమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
దీంతో మనస్థాపానికి గురైన వినోద్ కొంగరెడ్డిపల్లిలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. తను ప్రేమించిన అమ్మాయి కావాలని పట్టుబట్టాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సెల్ ఫోన్ లో వినోద్ తో మాట్లాడి, సంప్రదింపులు జరిపి అతన్ని కిందికి దించారు.