సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లు : శాసనమండలిలో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు బ్రేక్‌!

ఏపీ శాసనమండలిలో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యాలయం స్పష్టం చేసింది.

  • Publish Date - February 11, 2020 / 01:08 AM IST

ఏపీ శాసనమండలిలో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యాలయం స్పష్టం చేసింది.

ఏపీ శాసనమండలిలో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యాలయం స్పష్టం చేసింది. ఛైర్మన్‌ షరీఫ్‌ పంపిన ఫైలును లెజిస్లేచర్‌ కార్యదర్శి తిప్పి పంపినట్లు తెలుస్తోంది. సెలెక్ట్ కమిటీకి టిడిపి, బిజెపి, పిడిఎఫ్ ఎమ్మెల్సీలు తమ సభ్యుల జాబితా పంపించినా… శాసనమండలి అధికారులు వారి పేర్లను పరిగణలోనికి తీసుకోలేదు.

శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ ప్రతిపాదనకు సభ ఆమోదం లేదని… నిబంధనల ప్రకారం మండలి ఛైర్మెన్ కు ఈ బిల్లులపై సెలెక్ట్ కమిటీలు వేసే విచక్షణాధికారం లేదని శాసన మండలి అధికారులు ఈ ప్రక్రియను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిబందనల ప్రకారం వీలు పడదని లెజిస్లేచర్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు శాసనమండలి ఛైర్మెన్ షరీష్ కు ఫైల్ తిప్పి పంపినట్లు తెలుస్తోంది. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీలపై ప్రతిపాదనకు సభ ఆమోదం లేదన్న కారణంతో ఫైల్‌ను తిప్పి పంపినట్లు గా లెజిల్లేచర్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిప్పి పంపిన ఫైల్ లో స్పష్టం చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఈ సెలెక్ట్ కమిటీలకు ఛైర్మెన్లు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారయణలు వ్యవహరించాలి.

ప్రభుత్వం తరుపు నుండి మంత్రులు కానీ, వైసిపి సభ్యులు కానీ సెలెక్ట్ కమిటీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దంగా లేరు. ఛైర్మెన్లు లేని సెలెక్ట్ కమిటీలు ఏర్పడే అవకాశం లేదు. ఈ సెలెక్ట్ కమిటీలో తాము ఉండబోమని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికారపార్టీకి మండలిలో వైసిపి సభానాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలు ఇచ్చారు. అంతేకాక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు 14 రోజుల్లోగా జరగాలని… 14 రోజుల సమయం గడచిపోయినందున మండలిలో ఛైర్మెన్ విచక్షణాధికారం ప్రకారం చెప్పినా సమయం గడచిపోయినందున షరీఫ్ ప్రకటనకు కాలం చెల్లిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు.

మరోవైపు సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగజగదీష్, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు తదితరులు లెజిల్లేచర్ సెక్రెటరీ బాలకృష్ణమాచార్యులను కలిసి విజ్ఞప్తి చేశారు. సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాల్ని పాటించాలని కార్యదర్శిని కోరారు. లెజిస్లేచర్ సెక్రెటరి బాలకృష్ణమాచార్యుల్ని అధికార పార్టీ బెదిరించి సెలెక్ట్ కమిటీ వేయకుండా చేసిందని ఆరోపించారు.

ఈ నేపధ్యంలో సెలెక్ట్ కమిటీలు ఏర్పాటయ్యే అవకాశాలు ఏ కోశానా కనిపించట్లేదు. మండలిలో బిల్లులకు పుణ్యకాలం పూర్తి చేసి అసెంబ్లీలోనే ఆమోదింపచేసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.