ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని మంత్రి పేర్నినాని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని మంత్రి పేర్నినాని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని చెప్పారు. జిల్లాలో రూ.కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు దొంగ దీక్షలు చేశారని విమర్శించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని తన వారికి ఇచ్చారని ఆరోపించారు.
పవనిజం అంటే జగన్ పై విమర్శలు చేయడమేనా అని ప్రశ్నించారు. పవనిజం అంటే టీడీపీతో లాలూచీ, జగన్ తో పేచీనా అని నిలదీశారు. జగన్ పై కేసులు ఉన్నాయని చెబుతున్న పవన్.. అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని గుర్తించలేరా అన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్‌ను నియమించారు. ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో… ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తూ జీవో జారీ చేశారు.
ప్రజా రవాణా శాఖ ఏర్పాటు, పోస్టులు, డిసిగ్నేషన్ల ఏర్పాటుపై వర్కింగ్ గ్రూప్ దృష్టి సారించనుంది. జీతాల చెల్లింపులు, పే-స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను ఖరారు చేయనుంది. నవంబర్ 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూప్ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.