విజయవాడ : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఫైర్ అయ్యారు. పౌరుషం అంటే ప్యాకేజీకి అమ్ముడుపోవడమా? అని పవన్ ని ప్రశ్నించారు. పవన్
విజయవాడ : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఫైర్ అయ్యారు. పౌరుషం అంటే ప్యాకేజీకి అమ్ముడుపోవడమా? అని పవన్ ని ప్రశ్నించారు. పవన్ అధికారపక్షాన్ని(టీడీపీ) వదిలేసి ప్రతిపక్షాన్ని(వైసీపీ) మాత్రమే విమర్శించడం దారుణం అని రామచంద్రయ్య అన్నారు. పవన్ తీరుతో.. ఆయన సిద్దాంతం నమ్మి పార్టీలో చేరినవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని చెప్పారు.
Read Also : Lakshmis NTR : హైకోర్టుకు ఏపీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం – వర్మ
6 నెలల కిందట చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిపై మాట్లాడిన పవన్ ప్రస్తుతం వైసీపీపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్యాకేజీలు పవన్ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయని ఎద్దేవా చేశారు. పౌరుషం అంటే ప్యాకేజీలకు అమ్ముడుపోవడం, లేని ఆవేశం తెచ్చుకోని ఊగిపోవడం కాదన్నారు. పౌరుషం అంటే చంద్రబాబుతో లాలూచీ పడటం కాదన్నారు. 2014లో ఒక్క సీటులోనూ పోటీ చేయకుండా.. బ్లాంక్ ఇచ్చినట్టు కాదని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.
నాలుగున్నరేళ్లలో పాలన బాగోలేకపోతే.. ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఇలాంటి రాజకీయాలు పనికి రావని, వీటిని ప్రజలు సహించరని రామచంద్రయ్య చెప్పారు. పవన్ తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని, తన పరువు తానే తీసుకుంటున్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు అని రామచంద్రయ్య ఆరోపించారు. బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకే పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు.
Read Also : తలసాని జోస్యం : బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 75 ఎంపీ సీట్లు