మహిళలపై పోలీసుల దురుసు ప్రవర్తన… రేపు రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపు

రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.

  • Publish Date - January 3, 2020 / 10:47 AM IST

రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.

రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను సీఎం చేస్తే మమ్మల్ని రోడ్డున పడేస్తారని.. మా బతుకులను బుగ్గిపాలు చేస్తారని అనుకోలేదని వాపోయారు. శాంతియుంతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసుల దాష్టీకం ఏంటని ప్రశ్నించారు. 

మందడంలో చేపట్టిన సకల జనుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న మహిళల్ని ఈడ్చి పడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన పోలీసులు మహిళలను అందిన చోటల్లా పట్టుకుని లాగిపడేశారు. దీంతో మహిళలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా మగ పోలీసులు గొంతు పట్టుకుని నులిమేశారని తెలిపారు. దీంతో శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, పలువురికి గాయాలయ్యాయని మండిపడ్డారు. 

సీఎం జగన్ పాలనలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మా కష్టాలు చెప్పుకుంటుంటే పోలీసులు ఇష్టానుసారంగా మహిళలపై విరుచుకుపడి నానా గలాటా సృష్టించారనీ…మెడలో ఉండి బంగారు గొలుసుల్ని..గాజుల్ని కూడా పోలీసులు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొనని మహిళలపై కూడా పోలీసులు జులుం ప్రదర్శించారని ఆరోపించారు. గొంతు పట్టుకుని నులిమేసి..బూటు కాళ్లతో తన్నారని, మహిళలను కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఓట్లు వేసి జగన్ ను సీఎంగా చేస్తే మహిళలపై పోలీసులతో దాడులు చేయిస్తారా? సీఎం కాన్వాయ్ వెళ్లాలంటే పోలీసులతో ప్రజలపై దాడిచేయిస్తారా? ఇదేనా మీ పాలనా? ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?  రైతులు, మహిళలను బాధ పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని.. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రైతులు, మహిళలు హెచ్చరించారు. రైతులు, మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా రేపు రాజధాని గ్రామాల బంద్ కు పిలుపు ఇచ్చినట్లు రైతులు తెలిపారు.