ఆగి వున్న యాసిడ్ లారీని ఢీకొన్న కారు : గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం  

  • Publish Date - December 31, 2019 / 05:08 AM IST

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలోని యాసిడ్ పడి గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం చెందారు. ఇబ్రహీం పట్నం డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాయలంలో రాగ మంజీరా అసిస్టెంట్ గా విదులు నిర్వహిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంలో లారీ ట్యాంకర్ దెబ్బతినగా లారీలోని యాసిడ్ మీద పడి రాగమంజీరా మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.

గమంజీరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో యాసిడ్ పడి కారు ముందు భాగం పూర్తిగా దగ్థమైపోయింది. కాగా..చావు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలీదు. రాగమంజీరా చావు ఇలా యాసిడ్ లారీ రూపంలో వచ్చిందని అనుకునేలా ఉంది ఈ ప్రమాదం జరిగిన తీరు.