చైన్ చీటింగ్ : మాండొలిల్ జ్యవెలరీ ఆన్ లైన్ మోసాల గుట్టు రట్టు

  • Publish Date - August 31, 2019 / 06:59 AM IST

విశాఖలో మరో మోసం బైటపడింది.గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్నారు ఐదుగురు బండారం బైటపడింది. మాండొలిల్ జ్యవెలరీ లిమిటెడ్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.7లక్షలకు పైగా నగదు..200లకుపైగా బంగారు నాణాలను  స్వాధీనం చేసుకున్నారు. 

ఈ స్కీమ్ లో రూ.11.500 చెల్లించి దాంట్లో మరో 15మందిని స్కీమ్ లో చేర్పిస్తే.. బంగారు నాణెంతో పాటు రూ.11.500లకు తిరిగి ఇచ్చేస్తామంటూ ప్రజలను మాయ చేశారు. గత రెండు రోజులుగా విశాఖలోని ఓ హోటల్ లో ఈ ముఠా మకాం వేసింది.  అన్ని రోజుల పాటు హోటల్ లో ఉన్నవారిపై హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చింది.దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, కస్టమ్స్ అధికారులు సదరు ముఠాకు సంబంధించిన ఐదుగురితో పాటు బంగారం కొనేందుకు వచ్చిన మరో 14 మందిని అరెస్ట్ చేశారు.

ఐదురుగు ముఠా సభ్యులంతా గుర్ గావ్ నుంచి వచ్చిన విశాఖలోని హోటల్ లో మకాం వేసి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.  వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరి వలలో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంతకాలం నుంచి ఈ మోసాలు చేస్తున్నారు? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.