చంద్రబాబు, లోకేశ్ కలిసి ఏపీని మోసం చేస్తున్నారు

భారీ ఖర్చుతో ఢిల్లీ పయనమైన చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతామంటూ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు పూనుకున్నాడు. ఇదిలా ఉంటే గుంటూరు భారీ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరైయ్యారు. చంద్రబాబు పాలనపై, రాజకీయ వైఖరిపై ధ్వజమెత్తారు. కొత్త రాజధాని పేరు చెప్పుకుని నిధులు మాయం చేస్తున్నారని పేర్కొన్నారు. తండ్రికొడుకుల వృద్దే చూసుకుంటున్నారు కానీ, రాష్ట్ర స్థితిగతుల గురించి పట్టించుకోవట్లేదని ఏకిపారేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ ఉద్దేశ్యం ఏంటో గుర్తు చేసుకోవాలని.. వారసులుగా చేయాల్సిన బాధ్యతను మర్చిపోవద్దని హితవు పలికారు. 

 

  • కొన్ని సత్యాలను చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. 
  • లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసమే కొత్త కూటమితో జతకట్టారు. 
  • కేంద్రం నుంచి ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే చంద్రబాబు పారిపోతున్నారు. 
  • ఈ సభకు ఖర్చు అంతా బీజేపీయే పెట్టుకుంది. ఇదే సభలో ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రారంభించాను. 
  • ఢిల్లీలో ఆందోళనకు చేస్తున్న ఖర్చును టీడీపీ పార్టీ నుంచి పెడుతున్నారా..? ప్రభుత్వ ఖజానా నుంచి పెడుతున్నారా..?
  • ఖర్చుల వివరాలపై ఏజీ ప్రజలకైనా సమాధానాలు చెప్పండి. 
  • రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోయి మోడీని తిట్టడంపైనే దృష్టి పెట్టింది. 
  • మీ అందరికీ ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందా లేదా?
  • రాష్ట్రానికి అన్యాయం చేసిన కుటుంబం ఒళ్లో వెళ్లి ఎందుకు కూర్చున్నారు?
  • మీ పార్టీ చరిత్రను కూడా మీరు మర్చిపోయారు. 
  • కాంగ్రెస్ లేని రాజకీయాల కోసం ఎన్టీఆర్ పోరాడితే ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ ముందే మోకరిల్లారు. 
  • కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించారు. 
  • ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసి ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడ ఉన్నా క్షోభిస్తుంది. 

అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకు చురకలంటించారు. ఎన్టీఆర్ ఆదర్శాలను మర్చిపోవద్దని అభిమానులకు సూచించారు.