రాష్ట్రం రావణ కాష్టంలా మారిందన్న చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల మోడల్ పంచాయతీ తీసుకొచ్చారని విమర్శించారు.

  • Publish Date - September 10, 2019 / 03:39 PM IST

వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల మోడల్ పంచాయతీ తీసుకొచ్చారని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల మోడల్ పంచాయతీ తీసుకొచ్చారని విమర్శించారు. గుంటూరులో మంగళవారం వైసీపీ 100 రోజుల పాలన, టీడీపీ నేతలపై వైసీపీ దాడులు.. పేరుతో రెండు పుస్తకాలు విడుదల చేశారు. రేపు చలో ఆత్మకూరు పేరుతో మరో పుస్తకం విడుదల చేస్తామని చెప్పారు. 

పులివెందుల ఫ్యాక్షన్ గుప్పిట్లో రాష్ట్రం మగ్గుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై 565 పైగా దాడులు జరిగాయని వెల్లడించారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేసి, ఆస్తులు ధ్వంసం చేశారని తెలిపారు. తమ కార్యకర్తలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. కేసులతో టీడీపీ నేతల మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని వాపోయారు.

పునరావాసంలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని హోంమంత్రి అంటున్నారని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై బెయిలబుల్, టీడీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టు పెడితే ఎదురుదాడి చేస్తున్నారని తెలిపారు. 

100 రోజుల వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. మీ ఆటలు ఇంకా సాగవవన్నారు. అప్రజాస్వామ్యంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

Also Read : జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారత అంతర్భాగం : పాక్ ప్రకటన