జగనే కారణం : పులిలాంటి కడప పిల్లిలా మారింది

వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్.. కడప పేరుని చెడగొడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కారణంగా కడప పౌరుషం పోయిందన్నారు.

  • Publish Date - April 1, 2019 / 11:27 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్.. కడప పేరుని చెడగొడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కారణంగా కడప పౌరుషం పోయిందన్నారు.

కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్.. కడప పేరుని చెడగొడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కారణంగా కడప పౌరుషం పోయిందన్నారు. జగన్ తన లాలూచీ రాజకీయాలతో పులిలాంటి కడపని పిల్లిలా మార్చేశాడని చెప్పారు. కేసుల మాఫీ కోసం ప్రధాని మోడీతో, ఆస్తుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రుల ఆస్తులు లాక్కున్న కేసీఆర్ కాళ్ల దగ్గర.. ఏపీని జగన్ తాకట్టుపెట్టారని విమర్శించారు. జమ్మలమడుగులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు.
Read Also : పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం

జగన్ దొంగ లెక్కలు రాసే వ్యక్తి అని, జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని చంద్రబాబు చెప్పారు. కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాని అభివృద్ది చేసే బాధ్యత నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి పనులు కంటిన్యూ కావాలన్నా మళ్లీ టీడీపీ గెలవాలని చంద్రబాబు చెప్పారు. ముద్దనూరు ప్రాజెక్ట్ మూసివేస్తారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడిన చంద్రబాబు.. ముద్దనూరు ప్రాజెక్ట్ మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవతో రైతులను ఆదుకుంటున్నామని, పెన్షన్ ను రూ.2వేలకు పెంచామని వెల్లడించారు.

జగన్ మహానాయకుడు, నోరు విప్పితే అబద్దాలే అని చంద్రబాబు మండిపడ్డారు. కడప జిల్లా ప్రజలు మనస్సాక్షిగా ఓటు వేయాలని చంద్రబాబు సూచించారు. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో మోసం చేశారని, ఐరన్ ఓర్ ను విదేశాలకు అమ్ముకున్నారని చంద్రబాబు ఆరోపించారు. నేను ఒట్టి హామీలు, ఒట్టి మాటలు చెప్పను అని అన్నారు. వైసీపీ నేతలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, వేల కోట్లు దోచుకున్న చరిత్ర జగన్ ది అని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ కు ఓటేస్తే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు. ఏపీపై విషం కక్కుతున్న కేసీఆర్ తో జగన్ కలుస్తున్నారని, తన లాభం కోసం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆస్తులను, కష్టాన్ని దోచుకున్న కేసీఆర్ కు ఊడిగం చేద్దామా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదేనా మన రోషం, పౌరుషం అని అడిగారు.
Read Also : ఇదీ బాబుగారి ప్రేమ : కన్నతల్లిని కూడా చూసుకోలేదు