సత్యవేడు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎన్నికల ప్రచారంలో సీఎంచంద్రబాబు మాట్లాడుతు..ఏపీని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై కసి తీర్చుకోవాలనీ..ఏపీ పేరు ఎత్తాలంటే కేసీఆర్ భయపడేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలంగాణలో ఉండి ఏపీ ప్రజలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ప్రజలంతా ముక్తకంఠంతో అరిచి చెప్పాలన్నాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోడీ, కేసీఆర్ జగన్ వెనుక ఉండి నడిపిస్తున్నారనీ..ఏపీని అభివృద్ధికాకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారనీ..ఈ ముగ్గుర్ని ఫినిష్ చేయాలని ఏపీ ప్రజల జోలికి వస్తే భయపడేలా చేయాలన్నారు చంద్రబాబు. సత్యవేడు రెండో కుప్పం కావాలని చంద్రబాబు కోరారు. కుప్పం ప్రజలపై తనకు అపారమైన నమ్మకముందని తాను కుప్పానికి వెళ్లకపోయినా తనను గెలిపించేంత ప్రేమ కుప్పం ప్రజలకు తనపై ఉందని ధీమా వ్యక్తంచేశారు చంద్రబాబు.