చంద్రబాబు పందికొక్కులా వ్యవస్థల్నినాశనం చేశారు : మంత్రి కొడాలి

  • Publish Date - December 13, 2019 / 05:06 AM IST

చంద్రబాబు పందికొక్కులాగా టీడీపీ పార్టీలోకి వచ్చి పార్టీ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారనీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం జగన్ అలా కాదు..వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..వ్యవస్థల్ని రూపొందించారనీ అన్నారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు నేతల అసెంబ్లీకి వస్తున్న క్రమంలో మార్షల్స్ తమకు అడ్డుకున్నారనీ.. తమపై దాడికి చేశారనీ టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో చంద్రబాబు కావాలని వివాదం రేకెత్తించటానికి ఇటువంటి యత్నాలు చేస్తున్నారనీ మంత్రులు..వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మండిపడుతై..చంద్రబాబు పందికొక్కులాగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారనీ విమర్శించారు.

చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చేందుకు ప్రత్యేకమైన మార్గం ఉంది. కానీ చంద్రబాబు కావాలని వివాదం చేయటానికి వేరే దారిలో వచ్చి మార్షల్స్ తమపై దాడికి యత్నించారిన అనటం చాలా సరికాదని అన్నారు. అసెంబ్లీ సభ్యులు కానివారు లోపలికి వచ్చేందుకు యత్నించారనీ అందుకే మార్షల్స్ అడ్డుకున్నారని..అంతే తప్ప చంద్రబాబుని లోపలికిరాకుండా ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు.

లోపలికి వచ్చి సమయంలో మార్షల్స్ ను చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ నానా దుర్బాషలాడరని..వారిపై దాడికి కూడా చేయటమే కాకుండా ఎదురు దాడికి దిగుతున్నారని ఆరోపించారు. సోనియా గాంధీని జగన్ ఎదిరించటం వల్లనే జగన్ పై కేసులు పెట్టి జైల్లోవేశారని కానా చంద్రబాబు సోనియాను..రాహుల్ ను పొగటం వల్లనే బైట ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు మెప్పుకోసం తాపత్రాయపడుతు ఆయన ఎలా చెబితే అలా చేస్తున్నారనీ..టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు.