‘చంద్రఘంట’ అలంకరణలో అమ్మవారు

  • Publish Date - October 1, 2019 / 04:19 AM IST

సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీకగా నిలయంగా వెలుగొందుతున్న బాసర పుణ్యక్షేత్రంలో శరన్నవాత్రి ఉత్సవాలు మూడవ రోజు జరుగుతున్నాయి. సరస్వతీ అమ్మవారు కొలువైన బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు ‘చంద్రఘంట’అలంకరణలో భక్తులకు దర్శమిస్తోంది. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో కొలువైన రాజేశ్వరీదేవి, శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శ్రీభ్రమరాంబదేవి అమ్మవార్లు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 

ఈ అలంకారంలో దేవి దశభుజాలు కలిగి ఉండి ప్రశాంతమైన వదనంతో సాత్విక రూపిణిగా దర్శనమిస్తుంది. దేవి శాంతి స్వరూపిణి అయినప్పటికీ ఇతోన్ముఖురాలుగా ఉండడం విశేషం. అమ్మవారి మస్తకంపై అర్ధచంద్రుడు ఉండడం చేత చంద్రఘంట దేవిగా పిలుస్తారు. చంద్రఘంట అలంకారంలోని అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల కష్టాలు తీరడమేగాక సమస్యలు సానుకూలంగా మారుతాయని పురాణాలు చెబుతున్నాయి.

‘చంద్రఘంట’ అలంకరణలో ఉన్న పరాశక్తిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మా కుటంబాలను చల్లగా చూడు తల్లీ అంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు.