ఇదేం పని : భార్యతో శ్రీశైలం గేట్లు ఎత్తించిన ఇంజినీర్

శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత సమయంలో అధికారులు వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. సాధారణంగా గేట్లు ఎత్తే విధులను అధికారులు చెయ్యాలి. కానీ జలవనరుల శాఖ

  • Publish Date - September 10, 2019 / 06:41 AM IST

శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత సమయంలో అధికారులు వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. సాధారణంగా గేట్లు ఎత్తే విధులను అధికారులు చెయ్యాలి. కానీ జలవనరుల శాఖ

శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత సమయంలో అధికారులు వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. సాధారణంగా గేట్లు ఎత్తే విధులను అధికారులు చెయ్యాలి. కానీ జలవనరుల శాఖ ఇంచార్జ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి తన పనిని భార్యకు అప్పగించారు. తన భార్యతో డ్యాం గేట్లు తెరిపించారు. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సమయంలో ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి.. తన భార్యతో 7వ గేటు ఎత్తించారు. ఇది విమర్శలకు కారణమైంది.

ఎస్ఈ తీరుని తప్పుపడుతున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఇంజినీర్ లేదా ఆపరేటర్ గేట్లు ఎత్తాలి. అలా కాకుండా భార్యతో గేట్లు ఎత్తించడం ఏంటని మండిపడుతున్నారు. అత్యుత్సాహం చూపించారని సీరియస్ అవుతున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.