మోడీకి పోయే రోజులొచ్చాయి :చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి పోయే రోజులు వచ్చాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని చంద్రబాబు విమర్శించారు.

  • Publish Date - April 4, 2019 / 01:27 PM IST

ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి పోయే రోజులు వచ్చాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని చంద్రబాబు విమర్శించారు.

ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి పోయే రోజులు వచ్చాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని చంద్రబాబు విమర్శించారు. తమపై అరాచకాలకు  పాల్పడుతుంటే ఆ గోడు తగిలి ప్రధాని ఉద్యోగం ఊడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. సుధాకర్ యాదవ్ అనే నేతపై ఐటీ  దాడులు చేయించారని, గుంటూరులో నాని అనే మరో నేత ఇంట్లో సోదాలు చేశారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నీ ఉద్యోగం శాశ్వతం అని అనుకోవద్దు, మళ్లీ రోడ్డుపై తిరిగే రోజొస్తుంది, నిన్ను ఛీకొట్టి ప్రజలు అసహ్యించుకునే రోజొస్తుంది, మా కడుపు కొట్టొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు, వైసీపీలో అవినీతి నేతలు లేరా? ఎందుకు  మాపై పడుతున్నావు?” అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లలో కూర్చునేలా చేయాలని పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. “టంగుటూరి  ప్రకాశం పంతులు జన్మించిన గడ్డ ఇది, బ్రిటీష్ వాళ్లకు రొమ్ము చూపించి, ధైర్యం ఉంటే కాల్చుకోమని ఎదిరించిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన స్ఫూర్తితో పోరాడుతాం, నువ్వు ఒక్క దాడి చేయిస్తే మేం 10  సీట్లు ఎక్కువగా గెలుస్తాం, నీ అంతు తేలుస్తాం!” అని చంద్రబాబు  హెచ్చరించారు.

మహిళలకు టీడీపీ అండగా ఉందని చంద్రబాబు చెప్పారు. రౌడీ అనే వాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఖబద్దార్ .. మీ పని  కూడా చేస్తాం మని చంద్రబాబు హెచ్చరించారు. మమ్మల్ని లొంగదీసుకోవడం ప్రపంచంలో ఎవరి వల్ల కాలేదన్నారు. అలాంటిది కేసీఆర్ కు లొంగుతామా అన్నారు. రౌడీ రాజ్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. వెలుగోడు ప్రాజెక్ట్ పూర్తయితే గిద్దలూరు సస్యశ్యామలం అవుతుందన్న చంద్రబాబు.. నదులను అనుసంధానం చేసే బాధ్యత తనది అని చెప్పారు. భావితరాల భవిష్యత్ కోసమే తన పోరాటం అన్నారు.