జగన్‌కి వేల కోట్లు ఎవరిచ్చారు : కేసీఆర్‌కి ఏపీలో ఏం పని

అమరావతి : ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని, ఓటర్లను ప్రలోభపెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

  • Publish Date - April 12, 2019 / 08:26 AM IST

అమరావతి : ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని, ఓటర్లను ప్రలోభపెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

అమరావతి : ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని, ఓటర్లను ప్రలోభపెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అపోజిషన్ పార్టీకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు ఓటుకి రూ.3వేలు ఇచ్చారని చంద్రబాబు అన్నారు.

పోలింగ్ రోజున వందల సంఖ్యలో ఈవీఎంలు మొరాయిస్తే, లోపాలు వస్తే.. జగన్ ఈసీని ఒక్క మాట కూడా అనలేదని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ మౌనం అనుమానాలకు దారితీసిందన్నారు. ఎన్నికల సంఘం వైసీపీకి సహకరించిందని, అందుకే జగన్ ఈవీఎంల సమస్యలపై మాట్లాడలేదని, ఈసీని ప్రశ్నించలేదని చంద్రబాబు అన్నారు.
Read Also : చంద్రబాబు ఆగ్రహం : అందరూ కలిసి టీడీపీపై కుట్రలు, ఏపీని బీహార్ చేస్తారా!

జగన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కూర్చుని కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఏ నాయకుడు కూడా హాలీడే తీసుకున్న ఘటనలు చరిత్రలో లేవన్న చంద్రబాబు.. జగన్ హాలీడే తీసుకున్నాడంటే కుట్రలు చేసేందుకే అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. జగన్ ప్రచారానికి బ్రేక్ వేస్తే చాలు కుట్ర చేసేందుకే అని నిర్ధారణ అయిందన్నారు.

​​​​​​​ప్రచారానికి విరామం ఇచ్చి లోటస్ పాండ్ కు పరిమితమైన జగన్.. డబ్బు కలెక్షన్, రౌడీల నియామకం, ఈవీఎంల మేనిపులేషన్ లపై ఫోకస్ చేశారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీలో ఏం పని అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో తప్పుడు పనులు చేసి మరింతగా కక్షలు పెంచారని కేసీఆర్ పై మండిపడ్డారు.