రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గోపాల కృష్ణ ద్వివేదితో సీఎం చంద్రబాబు భేటీ కాన్నున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటు ఫిర్యాదు చేయనున్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) గోపాల కృష్ణ ద్వివేదితో సీఎం చంద్రబాబు భేటీ కాన్నున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటు ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లల్లా ఈసీ వ్యవహరిస్తోందనీ సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.
ఈసీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, తమిళనాడులో ఆరోపణలు వచ్చినా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని..కానీ ఏపీలో మాత్రం ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి తోడు ఏపీలో అధికారులు, సీఐల బదిలీలు హాట్ టాపిక్ గా మారాయి. కీలక స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేసింది.
Read Also : ఊరుకు పోదాం ఓటు వేద్దాం చలో చలో : NH పై భారీ ట్రాఫిక్
కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును, చీఫ్ సెక్రటరీ పునేఠను బదిలీ చేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్, మంగళగిరి, తాడేపల్లి సీఐలపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది.
ఓవైపు అధికారుల బదిలీలు, మరోవైపు ఐటీ సోదాలు.. ఏపీలో కలకలం రేపాయి. వీటిపై సీఎం బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, ఈసీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే అధికారులను బదిలీ చేస్తున్నారని, ఐటీ సోదాలు జరిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు చంద్రబాబు.
Read Also : చైతన్యం వచ్చింది : పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు