సీఎం జగన్ సంచలన నిర్ణయం : చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు

సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేశారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

  • Publish Date - September 25, 2019 / 07:58 AM IST

సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేశారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేశారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు బుధవారం(సెప్టెంబర్ 25, 2019) వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. 4, 5 విడతల్లో ఇవ్వాల్సిన రూ.7959.12 కోట్లను నిలుపుదల చేసింది. వైఎస్సార్ రైతు భరోసా పథకం క్రమంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ ప్రభుత్వం మిగిలిపోయిన రెండు విడతల రుణమాఫీని విడుదల చేస్తూ.. జారీ చేసిన ఉత్తర్వులు, ఆర్థిక శాఖకు ఇచ్చిన ఆదేశాలను చాలా కాలం పాటు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేసేసింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నందున.. ఇక రైతులకు రుణమాఫీ వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదన్నట్లు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రైతులందరికీ షాక్‌కి గురి చేసేదే. రుణమాఫీ హామీ పార్టీ పరంగా టీడీపీ ఇచ్చినప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని చట్టబద్ధం చేశారు. ఇప్పటికే.. గత ప్రభుత్వంలో రుణమాఫీకి సంబంధించి బడ్జెటరీ ప్రాసెస్ పూర్తి చేశారు. చెక్కులు కూడా జారీ అయి.. బడ్జెట్ ఆమోదం పొందింది.

అంతకముందే ప్రభుత్వం.. రుణవిమోచన పత్రాలు, బాండ్లు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం వాటి గురించి ఆలోచించకుండా.. రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు. ఆ పథకం కింద.. రెండు విడతలుగా రూ.15 వేలు రైతులకు అందేవి. కానీ జగన్ సర్కార్.. ఆ మొత్తాన్ని రూ. 12వేల 500 గా నిర్ధారించింది. ఇప్పుడు ఆ మొత్తం నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు ఇస్తుందని చెబుతున్నారు. అంటే ఏపీ సర్కార్ ఇచ్చేది రూ. 6 వేలు 500 వందలు.