తల్లిని ఓడించారని ఉత్తరాంధ్రాపై జగన్ కక్ష కట్టారు

  • Publish Date - January 31, 2020 / 09:13 AM IST

జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను  దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని ఓడించారనే ద్వేషంతో ఉత్తరాంద్ర నడ్డివిరిచేలా జీఎన్ రావు కమిటీతో విశాఖపై విషంకక్కారని  ఆరోపించారు.

తుపాన్లు వస్తాయని, ఉప్పునీరు ముప్పు ఉందనీ..రక్షణ ఉండదని కుట్రపూరితంగా జీఎన్ రావు కమిటీతో కావాలని రిపోర్ట్ తయారుచేయించి..తనకు అనుకూలంగా రిపోర్ట్ రాయించారనీ ఆరోపించారు.  ఉత్తరాంధ్రాకు కంపెనీలు వస్తే ఎక్కడ అభివృద్ది చెందుతుందోననే భయంతో జగన్ కంపెనీలు, పెట్టుబడులు ఉత్తరాంధ్రాకు రాకుండా చేశారనీ..యువతకు ఉద్యోగాలు రాకుండా చేశారని విమర్శించారు.  

13 జిల్లాల్లో పర్యటించామని జీఎన్ రావు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలనీ..వైజాగ్ పై జీఎన్ రావు కమిటీలో పేర్కొన్న అంశాలు చూస్తే ఏ ఒక్కరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారని,ఆ రిపోర్టు ఓ చెత్త రిపోర్ట్ అని ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా అమరావతిని చంపేయడానికే వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు.

కాగా..2014 ఎన్నికల్లో విశాఖ నుంచి వైఎస్ విజయమ్మను ఎంపీగా పోటీ చేశారు. బీజేపీ ఎంపీగా పోటీ  చేసిన కంభంపాటి హరిబాబు చేతిలో 90,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు విజయమ్మ. అందుకే విశాఖపై జగన్ కక్ష కట్టారని లోకేశ్ ఆరోపించారు.