మారేడుమిల్లి బస్సు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా

  • Publish Date - October 15, 2019 / 09:40 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అత్యవసర చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. 

జిల్లాలోని మారేడుమిల్లి-చింతూరు మధ్య టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. మారేడుమిల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఘూట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

మృతులందరూ కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. మొత్తం రెండు టెంపో ట్రావెలర్ లలో 26 మంది వచ్చారు.  వీరందరూ సోమవారం (అక్టోబర్ 14, 2019) భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం బయల్దేరారు. అయితే మంగళవారం (అక్టోబర్ 15, 2019) ఒక టెంపో ట్రావెలర్ లోయలో పడిపోవడంతో అందులో ఉన్న ఎనిమిది మంది మృతి చెందారు.