మందాకిని మాకివ్వండి : ప్రధానికి సీఎం జగన్ లేఖ

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్‌కు

  • Publish Date - November 5, 2019 / 10:43 AM IST

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్‌కు

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడం లేదని… దీంతో రాష్ట్రంలో కరెంట్ కోతలు విధించాల్సి వస్తోందని… ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్ లేఖలో ప్రస్తావించారు.

2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఏపీకి కేటాయించలేదని జగన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఆధారపడుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కెపాసిటీ 5వేల 10 మెగావాట్లు కాగా.. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్, సింగరేణి కోల్‌ కాలరీస్‌ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర విభజనకు ముందు ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా అయ్యేది. విభజన తర్వాత సింగరేణి బొగ్గును తెలంగాణకు కేటాయించారు. కానీ ఏపీకి మాత్రం బొగ్గు నిల్వల్లో వాటా ఇవ్వలేదు. వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీ ఎండీసీకి కేటాయించారు. ప్రతీ గని నుంచి 5 ఎంఎంటీఏలు తీసుకోవచ్చని చెప్పారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీయడానికి నిర్వహణ వ్యయం అధికంగా ఉంది.

ఈ పరిస్థితి కారణంగా ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఆధారపడాల్సి వస్తోందని.. నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఇది అవరోధంగా మారిందని జగన్ తెలిపారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, తెలంగాణాల్లో బొగ్గు ఉత్పత్తి అవుతోందన్నారు. బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరా చేయాలన్నారు. బొగ్గు కొరతను నివారించడానికి, మందానికిని ‘ఎ’ కోల్‌ బ్లాక్, తాల్చేరు కోల్‌ ఫీల్డ్, అంగుల్‌ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు.

కాగా, 2020 మార్చి నాటికి మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు ఏపీ జెన్‌కో రెడీ అవుతోంది. ఇందుకోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం అవుతాయని అధికారులు లెక్క కట్టారు. అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. దీంతో మందానికిని-‘‘ఎ’’ కోల్‌ బ్లాక్, తాల్చేరు కోల్‌ఫీల్డ్, అంగుల్‌ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు జగన్. మరి జగన్ లేఖ పట్ల ప్రధాని మోడీ ఏ విధంగా రియాక్ట్ అనే ఆసక్తి నెలకొంది.