మూడు రాజధానులపై రేపే తేల్చేస్తాం : పార్టీ నేతలతో వై.ఎస్.జగన్

అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

  • Publish Date - January 19, 2020 / 10:07 AM IST

అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఆదివారం (జనవరి 19, 2020) క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు రేపటి కేబినెట్, అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించింది. జగన్ నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భద్రత ఏర్పాటు చేశారు. కీలకమైన పాయింట్లలో మూడంచెల భత్రత పెట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

మూడు రాజధానుల అంశం, సీఆర్డీఏ చట్టానికి సంబంధించిన ప్రతిపాదన.. సభలోకి తీసుకురానుండటంతో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఏ వ్యూహం రచించాలన్న ఆలోచనలు చేసినట్టు తెలుస్తోంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అంతకముందు కేబినెట్ సమావేశాల్లో ఆమోదించాల్సిన అంశాలపై కూడా చర్చించారు. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి, భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా మూడు రాజధానుల అంశంతోపాటు సీఆర్డీఏపై ఎలాంటి చర్చ చేపట్టాలనేదానిపై కూడా చర్చించారు. దీనికి సంబంధించి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

రేపు జరుగబోయే అసెంబ్లీ, కేబినెట్ సమావేశాలు కీలకం. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో రాజధానికి సిబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజధాని గ్రామాల్లో పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, రోడ్లపైకి ఎవరు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. పూర్తిస్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం సీఎం జగన్ అక్కడికి వెళ్తారు కాబట్టి రెండు సార్లు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. రేపు ఉదయం కూడా మరోసారి సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది.