విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారనీ కొనియాడారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన రాష్ట్రం మనదేనన్నారు.
చట్టం విషయంలో ఎవరికైనా రూల్..ఒకే చట్టం అనీ.. పేద..గొప్ప అనే తేడా చట్టం ముందు ఉండదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడుగు బలహీన వర్గాలను హింసించేవారిని వదలొద్దనీ పోలీసులకు ఆదేశించారు. లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఎవ్వరికీ ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఈ సంరద్భంగా సీఎం ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశ రక్షణకై చైనా సైన్యం దాడిలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన పోలీసు అధికారి కరణ్‌సింగ్ సహా పదిమంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామని సీఎం అన్నారు.