చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం (ఏప్రిల్ 20,2020) నేడు. చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు.  ఈ సందర్భంగా

  • Publish Date - April 20, 2020 / 06:13 AM IST

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం (ఏప్రిల్ 20,2020) నేడు. చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు.  ఈ సందర్భంగా

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం (ఏప్రిల్ 20,2020) నేడు. చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు.  ఈ సందర్భంగా ఆయనకు చాలామంది జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా… చాలా మంది ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందిస్తున్నారు. చంద్రబాబు ఇలాగే పూర్తి ఆరోగ్యంతో, చిరకాలం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతిపక్షంలో ఉంటూ… చంద్రబాబు… ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ… కరోనాపై పోరాటంలో… దేశానికీ, ఏపీకీ అండగా ఉంటున్నారని టీడీపీ నేతలు ప్రశంసించారు.

కాగా ఏపీ సీఎం జగన్ సైతం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు జగన్. సంపూర్ణ ఆరోగ్యంతో చంద్రబాబు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ:
దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా.. 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు:
తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నేతలు, తెలుగు తమ్ముళ్లు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కరోనా, లాక్‌డౌన్ వేళ ఆయన్ను నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో.. సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. అలాగే టీడీపీ కూడా చంద్రబాబు బర్త్ డే వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించింది.. కరోనా వంటి కష్టకాలంలో వేడుకలు నిర్వహించడం సరికాదని భావించింది. అందుకే స్పెషల్ వీడియోలతో బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తమ్ముళ్ల సేవా కార్యక్రమాలు:
కొంతమంది తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు బర్త్ డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు భోజనం, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. కాగా, దీనికి లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, తలకు క్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని సూచనల్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. కొందరు రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్, కరోనా వేళ కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. 

చంద్రబాబుకి మెగాస్టార్ బర్త్ డే విషెస్:
మెగాస్టార్ చిరంజీవి సైతం చంద్ర‌బాబుకు ట్విట్ట‌ర్ ద్వారా జన్మదిన శుభాంకాంక్షలు తెలిపారు. ‘దశాబ్దాలుగా అహర్నిశం ప్రజా సేవలో కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. మీ దూరదృష్టి, కష్టపడే మనస్తత్వం, అంకితభావం అత్యున్నతమైనవి’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పాటు గతంలో చంద్రబాబుతో ఓ వేడుక సందర్భంగా సరదాగా గడిపిన ఒక ఫోటోను షేర్ చేశారు.

Also Read |  కేరళపై కేంద్రం సీరియస్….కావాలంటే ఆ పని చేసుకోవచ్చని రాష్ట్రాలకు లేఖ