ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రచురించాలని నిర్ణయించారు.

  • Publish Date - December 8, 2019 / 03:28 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రచురించాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రచురించాలని నిర్ణయించారు. ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు ప్రచురించకూడదని నిర్ణయించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నిబంధనలు పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ప్రభుత్వ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటోతోపాటు మంత్రుల ఫొటోలు ప్రచురించేవారు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ విధానంలో మార్పు చేసింది. ప్రభుత్వ పథకాలు, ప్రకటనల్లో కేవలం సీఎం ఫొటో మాత్రమే ప్రచురించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ఇకనుంచి ప్రభుత్వ పథకాల్లో సీఎం ఫొటోను మాత్రమే ప్రచురించనున్నారు. అన్ని పథకాలు, ప్రకటనలు ముఖ్యమంత్రి ఫొటో, పేరుతో రానున్నాయి.