ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్

  • Publish Date - September 6, 2019 / 08:45 AM IST

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌తో కూడిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించనున్న జెట్టీకి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం జగన్ తన 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వివరించారు.

ఇంజనీరింగ్ తోపాటు ఉన్నత చదువులు చదివే ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. బోర్డింగ్, లాడ్జింగ్ చార్జీల కింద 20 వేల రూపాయలను విద్యార్థి తల్లికి అందజేస్తామని చెప్పారు. ప్రమణస్వీకారం చేసిన రోజునే అవ్వతాతల పెన్షన్ పై మొదటి సంతకం చేశానని తెలిపారు.

గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన పెన్షన్ కంటే సగటున సంవత్సరానికి మూడు రెట్లు పెంచి వారికి అండగా ఉండేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం పెన్షన్ 250 రూపాయల చొప్పున పెంచుతూ 3 వేల రూపాయలకు తీసుకెళ్తామని చెప్పారు.

బుడగ జంగాల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయబోతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తామని మాట ఇస్తున్నట్లులు చెప్పారు.

Also Read : సిక్కోలులో సీఎం జగన్ : కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన