భలే ఐడియా : ఒక్క చెవి ఉన్నవారు మాస్క్ ఇలా పెట్టుకోవచ్చు…

  • Publish Date - August 20, 2020 / 11:09 AM IST

కరోనా వైరస్..మాస్క్ మస్ట్. లేదంటే తప్పదు భారీ మూల్యం. నేటి కరోనా కాలంలో ఇదే నినాదంగా కొనసాగుతోంది. మాస్క్ పెట్టుకోవాలంటే రెండు చెవులు ఉండాలి. వాటికే మాస్క్ తగిలించుకోవాలి. లేదంటే మాస్క్ కట్టుకోవచ్చనుకోండి అది వేరే విషయం. కానీ మాస్క్ తగిలించుకోవాలంటే రెండు చెవులు ఉండాల్సిందే.కానీ ఒకే చెవి ఉన్నవారు మరి మాస్క్ ఎలా తగిలించుకోవాలనే విషయం గురించి ఎవరన్నా ఆలోచించారా? ఒక్కటే చెవి ఉన్న వాళ్ళు మాస్క్ ఎలా ధరిస్తారని ఎవ్వరూ ఆలోచించలేదు కదూ..కానీ దానికో చక్కటి ఐడియా ఇచ్చింది ఒకే చెవి ఉన్న మహిళ.



గోల్డెన్‌హార్ సిండ్రోమ్ అనే క్రానియోఫేషియల్ కండిషన్ కారణంగా ఒక చెవితో జన్మించిన రైస్ యార్‌బ్రో అనే మహిళ ఫేస్‌మాస్క్ ధరించడానికి ఒక వినూత్న ఆలోచన చేసింది. పాప్‌సాకెట్ ప్యాకెట్ తెరిచి దానిని చెవి భాగంలో పెట్టుకుంది. మరొకరు చెవి భాగంలో అచ్చం చెవిలా ఉండే ఓ వస్తువును అమర్చి ఫేస్‌మాస్క్‌ను ధరించింది.



అంతే సింపుల్ ..ఎందుకు దీనికింత వర్రీ..ఇదిగో ఇలా..అంటూ యార్ బ్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. రైస్ యార్‌బ్రో ఆలోచనకు నెటిజన్లు ఫిదా..భలే ఐడియా అంటూ మెచ్చుకుంటున్నారు..అవసరమే అన్నీ నేర్పిస్తుంది..అవసరమే అన్ని ఐడియాలు తెప్పిస్తుంది అనటానికి ఇదోక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు..