చిన్నస్వామి స్టేడియంలో బౌలర్లకు చుక్కలే: డివిలియర్స్

ఐపీఎల్ 2019లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌కు బెంగళూరు.. ముంబై ఇండియన్స్ జట్లు సిద్ధమైయ్యాయి. ఇరు జట్లకు లీగ్‌లో ఇది రెండో మ్యాచ్‌తో పాటు పరాజయాలతోనే మ్యాచ్‌కు దిగనున్నాయి. ఆర్సీబీ జట్టుకు ఓ ఆశాకిరణంలా కనిపిస్తోన్న డివిలియర్స్ మ్యాచ్ ను ఉద్దేశించి మాట్లాడాడు. 

చిన్నస్వామి స్టేడియం బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి. దాంతో ప్రతి బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టడం చాలా సులభం. బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడతాడనేది సందేహంగానే అనిపిస్తోంది. ఒకవేళ ఆడినా ప్రతి సారీ మంచి ప్రదర్శనే ఇవ్వగలడనే నమ్మకమేముంది. దీంతో బౌలర్లకు ఒత్తిడి ఖాయమనే చెప్పాలి’ 

‘బ్యాట్స్‌మెన్ గత మ్యాచ్ కంటే ఉత్తమంగా ఆడాలని ఆశిస్తున్నా. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుండడంతో మంచి క్రికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చక్కని బ్యాటింగ్ కనబరుస్తుందని కోరుకుంటున్నా’ అని డివిలియర్స్ ముగించాడు.