మీదే బాధ్యత : వైసీపీని ఏపీ గడ్డపై లేకుండా చెయ్యాలి

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ గడ్డపై లేకుండా చేయాలని, ఆ బాధ్యత ప్రజలదే అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోము అని

  • Publish Date - March 24, 2019 / 10:09 AM IST

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ గడ్డపై లేకుండా చేయాలని, ఆ బాధ్యత ప్రజలదే అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోము అని

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ గడ్డపై లేకుండా చేయాలని, ఆ బాధ్యత ప్రజలదే అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోము అని హెచ్చరించారు. ఈ ఎన్నికలు మన ఆత్మగౌరవానికి సంబంధించినవని చెప్పారు. హత్యా రాజకీయాలకు నిరసనగా వైసీపీని చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ చీఫ్ జగన్ సొంత జిల్లా కడప జిల్లా బద్వేల్ లో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు.

గోదావరి నుంచి బద్వేల్ కు నీరు తీసుకొస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బద్వేల్ లో ప్రతి ఇంటికి తాగు నీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన తర్వాతే కుప్పానికి నీళ్లు ఇచ్చామన్నారు. నదుల అనుసంధానం చేసిన ఘనత టీడీపీదే అని.. 62 సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే అని చంద్రబాబు చెప్పారు. మీ ఊర్లన్నింటిని సుందరమైన గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత నాది అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కడప జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే శక్తి మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఉందని సీఎం వెల్లడించారు. అన్నదాత సుఖీభవతో రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. కేంద్రం, ఆర్బీఐ ఒప్పుకోకున్నా రుణమాఫీ చేశామన్నారు. కేంద్రం సహకరించి ఉంటే మరింత ముందుకెళ్లేవాళ్లమన్నారు.

వివేకా హత్యను కూడా జగన్ రాజకీయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రతయ్నం చేశారని అన్నారు. వివేకా మరణాన్ని ఆయన కూతురు సునీతారెడ్డి కూడా రాజకీయం చేయడం బాధాకరం అని చంద్రబాబు వాపోయారు.