దీపం అంటే దేవతా స్వరూపం. దీపంలో సకల దేవతలు.. వేదాలు కొలువై ఉన్నాయని వేదాలు చెబుతున్నాయి. దీపంలో శాంతి ఉంది..కాంతి వుంది. దీపావళికి ముందుగా లక్ష్మీ పూజకు దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి గృహిణి స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసం, రెండో వత్తి అత్త మామల క్షేమం కోసం, మూడవ వత్తి తోడబుట్టిన క్షేమం కోసం, నాలుగ వత్తి ఇంటి గౌరవం, ఐశ్వర్యం, ధర్మం కోసం, ఐదవది వత్తి వంశాభివృద్ధి కోసం వెలిగిస్తారు. దీపారాధన ఎవరు చేసినా కనీసం రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి. ఒక్క వత్తితో దీపం వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు.
దీపారధనకు ఏ నూనె మంచిది : ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. ఇది సంప్రదాయ పరంగానే కాక శాస్త్ర పరంగా కూడా చాలా మంచిది. ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే మరింత మంచి జరుగుతుంది.
కొద్దిగా వేప నూనె తీసుకుని ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయాలు సిద్ధిస్తాయని..ఏ పని చేసినా చక్కటి ఫలితం లభిస్తుంది. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా ఇష్టం. ఈ నూనెతో దీపారాధన చేస్తే వారు భార్యా భర్తలూ అనోన్యంగా జీవిస్తారనీ..వారి దాంపత్య జీవితం చక్కగా ఉంటుందంటారు. శివపార్వతులు అంటే అన్యోన్యానికి ప్రతీక. వారిని దీపారాధనతో కొలిస్తే చాలా మంచి జరుగుతుంది. ఒక పార్వతీ నందుడైన విఘ్నేశ్వరుడిని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే కూడా చాలా మంచిది.
ముఖ్యంగా నువ్వుల నూనె దీపారాధన అంటే సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. వేరుశెనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడకూడదని వేద పండితులు చెబుతున్నారు.