నెల్లూరు జిల్లా ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే డాక్టర్ ఓ నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. నైట్ డ్యూటీలో ఉన్న నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. దీంతో నర్స్ వారి బంధువులకు చెప్పగా వారు హాస్పిటల్ కు వచ్చి డాక్టర్ ను చితక్కొట్టారు.
వివరాల్లోకి వెళితే..గత కొంతకాలంగా హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులను డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ లైంగికంగా వేధిస్తున్నాడు. వీరిలో ఓ నర్స్ పై కన్నేసిన డాక్టర్ ఆమెను పదే పదే వేధిస్తున్నాడు. కానీ ఏమీ చేయలేక..ఎవ్వరితోనే చెప్పుకోలేని మౌనంగా రోదించేది. సార్..మీకు ఇది న్యాయం కాదు అంటూ పదే పదే నచ్చచెప్పింది. కానీ ఆ కామాంధుడికి అవేవీ చెవికి ఎక్కలేదు. వేధింపులు మానలేదు. నా కోరిక తీరిస్తే..డ్యూటీలు వేసే విషయంలో నీకు అనుకూలంగా చూస్తాను అంటూ వేధింపులు కొనసాగిస్తున్నాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవటంతో అదను కోసం కాపుకాసాడు.
ఈ క్రమంలో సదరు నర్సు నైట్ డ్యూటీలో ఉండటం..అదే సమయంలో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా నైట్ డ్యూటీలో ఉండటంతో ఎలాగైనా సరే ఆమెను లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. దీంట్లో భాగంగా..నేను భోజనం తెచ్చుకున్నాను..నాకు ఆమ్లెట్ వేసి తీసుకురమ్మని చెప్పాడు. డాక్టర్ బుద్ధి తెలిసిన ఆమె భయంపడింది. ఆ పని మరెవరికన్నా చెప్పండి అని చెప్పింది. కానీ డాక్టర్ వినలేదు. నువ్వే ఆమ్లెట్ తీసుకురమ్మని చెప్పాడు. దీంతో సీనియర్ డాక్టర్ రావటంతో ఏమీ చేయలేని ఆమె ఆమ్లెట్ వేసి డాక్టర్ రూమ్ కు తీసుకెళ్లింది. దీంతో అదే సమయం అని ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె భయపడిపోయింది. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది.
తీవ్ర ఆగ్రహంతో హాస్పిటల్ కు వచ్చిన వారు డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ను చొక్కా పట్టుకుని ఈడ్చి ఈడ్చికొట్టారు. ఇటువంటి పని మరోసారి చేస్తే చంపి పాతరేస్తామంటూ హెచ్చరించారు. కాగా గత కొంతకాలం క్రితం పొదలకూరు హాస్పిటల్ లోను సీతాపురంలోను పనిచేసిన డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్కానింగ్ కోసం హాస్పిటల్ కు వచ్చిన ఓ గర్భిణితో కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. ఇటువంటి కామాందులపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సిబ్బంది..బాధితురాలి కుటుంబ సభ్యలు డిమాండ్ చేస్తున్నారు.