మనిషి మద్యం తాగటం వల్ల విచక్షణ కోల్పోయి..హింసలకు పాల్పడే అవకాశముందని అందుకే ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..విడతల వారీగా మద్యాన్ని నియంత్రిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళల భద్రత బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్న సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..మహిళలపై జరగుతున్న హింసలు మద్యం సేవించిన సందర్భాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయనీ అందుకే తమ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించేదుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విడతల వారీగా బెల్ట్ షాపులను నియంత్రిస్తున్నామని తెలిపారు. కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చామని..మద్యం పరిమిట్లను రద్దు చేశామని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికే 43వేల బెల్డ్ షాపుల్ని రద్దు చేశామనీ చెప్పటానికి గర్విస్తున్నామన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మద్యం నియంత్రణలో భాగంగానే.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మద్యం షాపులల్లో విక్రయించటం వంటి కీలక నిర్ణయాలను జారీచేసింది ప్రభుత్వం.
ఇప్పటికే వేలాది బెల్ట్ షాపులు ఎత్తివేయటం..బార్లపై ఆంక్షలు..మద్యం ధరల పెంపు వంటి పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఇలా విడతల వారీగా మద్యాన్ని నియంత్రించి పూర్తిస్థాయి మద్య నిషేధం చేసేలా చర్యలు తీసుకుంటోంది ఏపీలోని సీఎం జగన్ ప్రభుత్వం.