టీడీపీ ఎమ్మెల్యే వీరంగం : వైసీపీ కార్యకర్తలను తరిమి కొట్టిన బడేటి బుజ్జి

  • Publish Date - April 11, 2019 / 04:37 AM IST

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను ఆయన తరిమి తరిమి కొట్టారు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆవేశంతో ఊగిపోయారు. వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఎమ్మెల్యే ఆయన అనుచరులు, గన్ మెన్ తమపై దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు వాపోయారు. అకారణంగా తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వారిపై దాడి జరిగింది.